Attack on Hijra: హిజ్రాపై మోజుపడ్డ యువకుడు.. మాట ముచ్చటతో దగ్గరయ్యారు.. తనను దూరం చేయడం తట్టులేక..

|

Aug 14, 2021 | 5:19 PM

హిజ్రాపై మోజుపడ్డ ఓ యువకుడు.. తనను దూరం చేస్తుందని కోపం పెంచుకున్నాడు.. ఆమె పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు..

Attack on Hijra: హిజ్రాపై మోజుపడ్డ యువకుడు.. మాట ముచ్చటతో దగ్గరయ్యారు.. తనను దూరం చేయడం తట్టులేక..
A Man Attack On Transgenders
Follow us on

Man attack on Transgender: హిజ్రాపై మోజుపడ్డ ఓ యువకుడు.. తనను దూరం చేస్తుందని కోపం పెంచుకున్నాడు.. ఆమె పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు.. ఏకంగా ఇంట్లోకి చొరబడి కత్తితో వీరంగం సృష్టించాడు.. హిజ్రాపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు.. తోటి హిజ్రాలు అడ్డుకోవడంతో ప్రాణాలతో బయటపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన వరంగల్‌లోని శివనగర్ లో జరిగింది..ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

శివనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సాయిప్రియ అనే ట్రాన్స్‌జెండర్‌తో గీసుకొండ మండలంకు చెందిన మహమ్మద్ అబ్బు అనేవ్యక్తి చనువుగా ఉండేవాడు. ఆ ట్రాన్స్‌జెండర్‌పై మనసు పారేసుకున్నాడు. దీంతో ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమ చిగురించింది. ఇద్దరి మద్య తరుచు డబ్బుల విషయంలో గోడవలు జరిగేవి. ఈ క్రమంలో సాయిప్రియ అబ్బును దూరం పెట్టింది. దీంతో ఆమెపై ఆగ్రహంతో ఊగిపోయాడు అబ్బు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి కోపంతో హిజ్రా ఇంటికి వచ్చిన అబ్బు కత్తితో వీరంగం సృష్టించాడు.

సాయిప్రియపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. తోటి హిజ్రాలు అడ్డుకుని సాయిప్రియ ప్రాణాలు కాపాడారు. వెంటనే సాయిప్రియను ఎంజీఎం అసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీంతో అబ్బు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి శనివారం తోటి హిజ్రాలు మిల్స్ కాలనీ పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. హిజ్రాలను నమ్మించి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చేప్పి డబ్బులు వసూల్ చేస్తు చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, ఇలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని హిజ్రాలు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అబ్బు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also…. Afghanistan President Ashraf Ghani: అస్థిరత ప్రమాదంలో చిక్కుకున్న దేశం..నివారిస్తాం..దేశ ప్రజలనుద్దేశించి ఆఫ్ఘన్ అధ్యక్షుని ప్రసంగం.. 

Corona Affect on Brain: కరోనా వైరస్‌ మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుంది..ఎలా దానిని నివారించవచ్చు? నిపుణులు ఏమంటున్నారు?