‘సార్పట్ట’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్య.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇంకో విశేషం ఏంటంటే… ఈ మధ్యే ఆర్య భార్య సాయేషా సైగల్.. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆ ఇంట ఆనందాలు విరబూశాయి. ఈ సమయంలో ఆర్యపై జర్మనీకి చెందిన ఓ మహిళ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆర్య.. రూ.70 లక్షలు తీసుకున్నాడని జర్మనీకి చెందిన విజ్డా ఆన్లైన్లో కంప్లైంట్ చేసింది. తామిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా సమర్పించింది. ఆర్య తర్వాతి సినిమాలు విడుదల కాకుండా బ్యాన్ విధించాలని ఆమె కోరింది. ఈ కేసుపై గురువారం విచారణ జరిగింది. మరిన్ని ఆధారాలు సేకరించాలని జడ్జి.. పోలీసులను కోరారు. ఆగస్టు 17కు విచారణను వాయిదా వేశారు. అయితే ఈ విషయమై ఆర్య, అతడి టీమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
నాని ‘భలే భలే మగాడివోయ్’కు తమిళ రీమేక్ ‘గజినికాంత్’ సినిమా షూటింగ్లో కలుసుకున్న ఆర్య- సాయేషా లవ్‌లో పడ్డారు. 2019 మార్చి 10న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె భర్తతో కలిసి ‘టెడ్డీ’ సినిమా, కన్నడలో ‘యువరత్న’ మూవీ చేసింది. అయితే సాయేషా గర్భం దాల్చిన విషయాన్ని ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఆమె ప్రసవించిన తర్వాత, అది హీరో విశాల్ చెబితేనే అందరికీ తెలిసింది.
Also Read:Chittoor District: ‘మంచి చేయడమే తప్పైంది’.. ఇంటికి పిలిచి బట్టలిప్పి మరీ చితకబాదాడు