Building Collapsed: విషాదం.. కుప్పకూలిన బిల్డింగ్.. ఒకరి మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు..

Building Collapsed in Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఖేర్వాడి రోడ్‌లోని

Building Collapsed: విషాదం.. కుప్పకూలిన బిల్డింగ్.. ఒకరి మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు..
Mumbai Bandra

Updated on: Jun 07, 2021 | 9:07 AM

Building Collapsed in Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఖేర్వాడి రోడ్‌లోని ఓ భవనం అర్ధరాత్రి కుప్పకూలింది. దీంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయని బీఎంసీ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అనంతరం బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని రక్షించినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

కాగా.. సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే జీషన్‌ సిద్ధిఖి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో బిల్డింగ్‌ కూలిపోయిందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది బాధితులను కాపాడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డింగ్ ఏలా కూలిందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. దీంతోపాటు టౌన్ ప్లానింగ్, ఇంజనీర్ అధికారులు కూడా పరీశీలిస్తున్నారు.

Prince Harry: బ్రిటన్ యువరాజు హ్యారీ, మార్కెల్ దంపతులకు ఆడబిడ్డ.. ఏం పేరు పెట్టారో తెలుసా..?

Income Tax E-filing Portal: అందుబాటులోకి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్.. మొబైల్‌యాప్‌నూ విడుదల చేయనున్న సీబీడీటీ