Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. నలుగురు స్టూడెంట్స్ మృతి..

|

Aug 16, 2022 | 5:11 AM

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు.

Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. నలుగురు స్టూడెంట్స్ మృతి..
Road Accident
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు సమాచారం అందించారు. ఇద్దరు అమ్మాయిలతో సహా మొత్తం నలుగురు వ్యక్తులు కారులో ఉన్నారని వారు తెలిపారు. చిలకలూరిపేటకు వెళ్తుండగా జాతీయ రహదారి-16పై తుమ్మలపాలెం గ్రామం వద్ద వారి కారు లారీని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు.

ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, “టైర్ దెబ్బతినడంతో లారీ రోడ్డుపై ఆగి ఉంది. అదే సమయంలో విజయవాడ నుంచి వస్తున్న కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో అందులోని వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు కాకినాడకు చెందిన చైతన్య పవన్, విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి, విశాఖపట్నానికి చెందిన సౌమికగా గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే నాలుగో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.