
ఒడిషాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మయూర్‌బంజ్ జిల్లాలోని తారాకొటి ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవే -18పై బోట్నోటి పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఓ జీపులో 4.45 క్వింటాల్లో గంజాయిని గుర్తించారు. సోమవారం ఉదయం పక్కా సమాచారం అందడంతో.. తనిఖీలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే జీపు అనుమానాస్పదంగా వస్తుండటంతో.. తనిఖీలు చేపట్టామని అందులో 4.45 క్వింటాల్లో గంజాయిని గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు రూ.15 లక్షల వరకు ఉంటుందన్నారు.
Odisha: Police have seized 4.45 quintal cannabis worth Rs 15 lakhs near Tarakoti in Mayurbhanj district pic.twitter.com/Ww82ywBPx8
— ANI (@ANI) August 18, 2020
Read More :