AP Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మృతుల్లో వైసీపీ నేత..

Kurnool District: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న కారును ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే

AP Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మృతుల్లో వైసీపీ నేత..
Ap Road Accident

Updated on: Sep 04, 2021 | 9:42 PM

Kurnool District: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న కారును ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు అధికార వైసీపీ నేత.. మరొకరు ఓ టీవీ ఛానెల్‌ విలేకరి కూడా ఉన్నారు. కర్నూలు జిల్లా పాములపాడు మండలం మద్దూరుకు చెందిన వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఇ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కు ప్రధాన అనుచరుడు. మండల స్థాయి నేతగా సుపరిచితుడు. ఆత్మకూరులో నివాసముంటున్న శ్రీనివాసరెడ్డి, ఓ టీవీ ఛానెల్‌ విలేకరి సుధాకర్ గౌడ్, తన దగ్గర పనిచేసే లింగంతో కలసి ఇన్నోవా కారులో బెంగళూరు వెళ్లి తిరిగి వస్తుండగా ప్యాపిలి మండలం కల్చాట్లా బ్రిడ్జి దగ్గర టైరు పేలింది.

దీంతో వేగంతో ఉన్న కారు.. నేరుగా వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో.. వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి, విలేకరి సుధాకర్ గౌడ్, లింగం ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Bihar MLA: ట్రైన్‌లో ఆ ఎమ్మెల్యే చేసిన గలీజు పనికి ప్రయాణికుల పరేషాన్‌.. ఏం చేశాడంటే..?

Viral Video: మాస్క్‌ పెట్టుకోలేదని ఫైన్‌ కట్టమంటే.. ఆ డ్రైవర్‌ చేసిన ఘనకార్యం చూడండి.. వీడియో వైరల్