Vistara Flight: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. 15 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా.. విమానంలో కుదుపులు..

|

Jun 08, 2021 | 8:57 AM

Kolkata AirPort: పశ్చిమ బెంగాల్‌లో విస్తారా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. మరో 15 నిమిషాల్లో విమానం ల్యాండ్ అవుతుందనగా.. కుదుపులకు

Vistara Flight: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. 15 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా.. విమానంలో కుదుపులు..
Vistara Flight
Follow us on

Kolkata AirPort: పశ్చిమ బెంగాల్‌లో విస్తారా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. మరో 15 నిమిషాల్లో విమానం ల్యాండ్ అవుతుందనగా.. కుదుపులకు గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. విస్తారా ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్‌ 737 విమానం ముంబై నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో మరో 15 నిమిషాల్లో విమానం కోల్‌కతాలో ల్యాండ్ కావాల్సి ఉంది. అప్పుడే విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైందని అధికారులు తెలిపారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

చివరకు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కోల్‌కతాలో సురక్షితంగా ల్యాండవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన ప్రయాణికులను విమానాశ్రయంలో ప్రథమిక చికిత్స అందించి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్, డీజీసీఏ అధికారులు వెల్లడించారు. గాయపడిని ముగ్గురిలో ఒకరు డిశ్చార్జి కాగా.. మరో ఇద్దరు కోల్‌కతాలోని రెండు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. స్వల్పంగా గాయాలైన వారు కూడా ఇళ్లకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని డీజీసీఏ అధికారులు తెలిపారు.

Also Read:

Prisioner: తప్పిపోయిన ఖైదీ కోసం ఊరంతా వెతికి పోలీసులు.. చివరికి జైల్లోనే ఉన్నాడని తెలిసి..

Remdesivir: ‘రెమిడెసివిర్’ను ఆసుపత్రులే ఇవ్వాలి.. ఎప్పుడు పడితే అప్పుడు వాడొద్దు.. కేంద్రం గైడ్‌లైన్స్