
ఒడిషా రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. మయూర్‌భంజ్‌లో స్పెసల్ టాస్క్‌ఫోర్ప్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలో 3.285 కిలోల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మయూర్‌భంజ్ ప్రాంతంలో ఓ ఇంట్లో అక్రమంగా డ్రగ్స్ నిల్వ చేశారన్న సమాచారం రావడంతో.. రంగంలోకి టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడి నిర్వహించారు. ఈ విషయాన్ని ఒడిశా పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (నేరాలు, లాండ్ అండ్ ఆర్డర్) సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మొత్తం 15.648 కిలోల బ్రౌన్‌షుగర్‌ను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. 2013-2019 వరకు 7.5 కిలోల బ్రౌన్ షుగర్‌ను సీజ్ చేయగా.. కేవలం ఒక్క ఈ ఏడాదిలో 15.648 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో బ్రౌన్ షుగర్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.