Road Accident: పెళ్లికి హాజరై వస్తుండగా.. పేలిన కారు టైర్లు.. ఇద్దరు దుర్మరణం

|

Feb 07, 2022 | 5:30 AM

Ranga Reddy Road Accident: తెలంగాణ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ సమీపంలో సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి హాజరై ఇంటికి

Road Accident: పెళ్లికి హాజరై వస్తుండగా.. పేలిన కారు టైర్లు.. ఇద్దరు దుర్మరణం
Road Accident
Follow us on

Ranga Reddy Road Accident: తెలంగాణ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ సమీపంలో సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి హాజరై ఇంటికి వస్తుండగా.. కారు అదుపు తప్పడంతో బొల్తాపడింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు (Ranga Reddy) కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతులు వట్టినాగులపల్లికి చెందిన తలపల్లి రామకృష్ణ, మటూరి శ్రీకాంత్ గా గుర్తించారు. కారు ( Car Accident) వేగంతో వెళుతుండటంతో వాహన టైర్లు పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌ లింగంపల్లి నుంచి యాచారం మండలం మాల్‌లో జరిగిన వివాహానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read:

AP Crime News: అనంతపురంలో ఘోరం.. నడిరోడ్డుపై దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే..

Anantapur Accident: పెళ్లింట చావు మేళం.. ఇంటికి వస్తుండగా కబళించిన మృత్యువు.. 9 మంది మృతి