Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. అదుపుతప్పి చెట్టును ఢికొన్న కారు.. ఇద్దరు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు..

హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ కుంటుంబం కారులో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తుండగా కారు ప్రమాదానికి..

Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. అదుపుతప్పి చెట్టును ఢికొన్న కారు.. ఇద్దరు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు..

Updated on: Jan 30, 2021 | 5:06 PM

Road Accident: శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట వద్ద శనివారం మధ్యాహ్నం జరిగింది. మృతులు హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌, సరస్వతిగా పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ కుంటుంబం కారులో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Honour killing: ప్రేమ జంటపై పాశవికంగా దాడి.. హత్య చేసి.. ఆపై చెట్టుకు వేలాడదీసిన బాలిక బంధువులు

Road Accident: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి.. మరికొంత మంది పరిస్థితి విషమం..