Road Accident: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి.. మరికొంత మంది పరిస్థితి విషమం..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మోరాదాబాద్ - ఆగ్రా జాతీయ ర‌హ‌దారిపై మినీ బ‌స్సు - ట్ర‌క్కు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న ప‌ది మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు..

Road Accident: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి.. మరికొంత మంది పరిస్థితి విషమం..
Follow us

|

Updated on: Jan 30, 2021 | 11:01 AM

Road Accident in UP: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మోరాదాబాద్ – ఆగ్రా జాతీయ ర‌హ‌దారిపై మినీ బ‌స్సు – ట్ర‌క్కు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న ప‌ది మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘోర ప్రమాదం యూపీలోని కుందార్కి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శ‌నివారం ఉద‌యం చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆసుపత్రికి త‌ర‌లించారు. వెంటనే ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించింది. వాహనాలు అధిగమిస్తున్న క్రమంలో మూడు వాహనాలు ఒకదానికొకటి ఢికొన్నాయని ప్రత్యక్ష సాక్షలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.

సీఎం యోగి అధిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి.. మోరాదాబాద్ ఘోర రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున, క్ష‌త‌గాత్రుల‌కు రూ. 50 వేలు చొప్పున పరిహారాన్ని ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని సీఎం యోగి అధికారుల‌ను ఆదేశించారు.

Also Read:

Latest Articles