దేశంలోనే తొలిసారి: బాలనేరస్తుడికి యావజ్జీవం

|

Jun 28, 2019 | 7:42 AM

మైనర్ నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ బార్కస్‌లో నివసించే ఓ మైనర్ పొరిగింటి బాలుడిని(10) మభ్యపెట్టి స్కూలు‌పైకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి హతమార్చాడు. దీనికి గానూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు మైనర్ నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా 2 ఏళ్ళ క్రితం ఈ ఘటన జరిగినప్పుడు నిందితుడు(17) బాలనేరస్థుడు అవడంతో.. దేశంలో ఒక మైనర్‌కు […]

దేశంలోనే తొలిసారి: బాలనేరస్తుడికి యావజ్జీవం
Follow us on

మైనర్ నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ బార్కస్‌లో నివసించే ఓ మైనర్ పొరిగింటి బాలుడిని(10) మభ్యపెట్టి స్కూలు‌పైకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి హతమార్చాడు. దీనికి గానూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు మైనర్ నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా 2 ఏళ్ళ క్రితం ఈ ఘటన జరిగినప్పుడు నిందితుడు(17) బాలనేరస్థుడు అవడంతో.. దేశంలో ఒక మైనర్‌కు యావజ్జీవ కఠిన జైలుశిక్ష విధించడం ఇదే తొలిసారి.