పశ్చిమ బంగాల్ (West Bengal) లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో పడవ మునిగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. సుందర్బన్ ప్రాంతానికి చెందిన 18 మంది మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. చేపలు పడుతున్న సమయంలో వారి పడవ ప్రమాదానికి గురైంది. పడవ దక్షిణ 24 పరగణాలు జిల్లా కాక్డివిప్ సమీపంలోకి చేరగానే ఈ ఘటన జరిగింది. పడవ ఒక్కసారిగా మునిగిపోవడంతో మత్స్యకార్మికులందరూ (Boat Accident) సముద్రంలో పడిపోయారు. నీటిలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డులు, స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో మత్స్యకారుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా.. ఇప్పటివరకు ఒక్కరి జాడ కూడా గుర్తించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రాత్రి అయినప్పటికీ పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం