Food Poison: అమ్మాయి ప్రాణం తీసిన ‘షవర్మా’.. 16 ఏళ్ల యువతి మృతి.. మరో 35 మందికి..

Food Poison: ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా యువతి మృతి చెందిన ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. షవర్మా తినడం వల్ల 16 ఏళ్ల యువతి మరణించడంతో పాటు మరో 18 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ షాకింగ్ సంఘటన...

Food Poison: అమ్మాయి ప్రాణం తీసిన షవర్మా.. 16 ఏళ్ల యువతి మృతి.. మరో 35 మందికి..
Shawarma

Updated on: May 02, 2022 | 8:44 AM

Food Poison: ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా యువతి మృతి చెందిన ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. షవర్మా తినడం వల్ల 16 ఏళ్ల యువతి మరణించడంతో పాటు మరో 18 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ షాకింగ్ సంఘటన కేరళలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కన్హన్‌గడ్‌లోని కొంత మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న ఓ బేకరీలో షవర్మా తిన్నారు. షవర్మా తిన్నవారంతా అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో 16 ఏళ్ల దేవానంద అనే టీనేజీ యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది.

దీంతో ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. మిగతా వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అస్వస్థకు గురైన విద్యార్థులు జ్వరం, డయేరితో ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాణాపాయం లేదని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా వైద్యాధికారి డా. ఏవీ రాందాస్‌ తెలిపారు. రంగంలోకి దిగిన అధికారులు సదరు దుకాణంపై కేసు నమోదు చేసి సీజ్‌ చేశారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జి ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అస్వస్థతకు గురైన ఇతరులకు నాణ్యమైన చికిత్స అందించాలని తెలిపారు. దీనంతటికీ ఫుడ్‌ పాయిజన్‌ కావడమే కారణమని అధికారులు అంచనాకు వచ్చారు. దర్యాప్తునకు ఆదేశించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Dining Out: సరదాగా బయట తినాలంటే బిల్లు’ వర్రీనా? ఇలా చేస్తే ‘నో టెన్షన్

కన్నబిడ్డలను గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. మద్యం మత్తులో దారుణం

Aunty dance: ఆంటీనా మాజాకా.! మందేసి చిందేస్తూ నాగిని డాన్స్‌తో రెచ్చిపోయిన ఆంటీ..