ఝార్ఖండ్‌లో గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. దామోదర్ నదిలో పడవ బోల్తా (Boat Accident) పడిన ఘటనలో మొత్తం14 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే జమ్తారా జిల్లా యంత్రాంగంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది సకాలంలో స్పందించి నలుగురిని ఎలాగోలా ఒడ్డుకు చేర్చారు. మరో 14 మంది గల్లంతయ్యారు. వీరి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఝార్ఖండ్ (Jharkhand)లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధన్ బాద్‌లోని నిర్సా నుంచి జమ్తర్‌కు వెళుతుండగా.. బార్బెండియా వంతెన వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కాగా పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. ‘గల్లంతైన ప్రయాణికులను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం, ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అందరూ సురక్షితంగా తిరిగిరావలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. కాగా ఒడ్డుకు చేరిన నలుగురిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పేర్కొన్నారు.
जामताड़ा जिले में बीरगांव के पास नौका पलटने की दुर्भाग्यपूर्ण सूचना मिली है।
जिला प्रशासन और एनडीआरएफ की टीम लोगों के रेस्क्यू ऑपरेशन का कार्य कर रही है।
सभी सुरक्षित रहें, यही कामना करता हूँ।— Hemant Soren (@HemantSorenJMM) February 24, 2022
Viral Video: అమ్మో పాము.. గుడ్లన్నీ గుటుక్కున మింగేసింది.. ఆ తరువాత ట్విస్ట్ చూస్తే షాక్..
Viral Video: కోతా మజాకా !! ఆకలిమీదున్న చిరుతను ఆడేసుకుంది !! వీడియో