Online Gaming: ఆన్‌లైన్ గేమ్‌ వ్యసనంతో 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. మమ్మీ సారీ అంటూ..

| Edited By: Phani CH

Jul 31, 2021 | 1:11 PM

పిల్లలు మొబైల్స్ లోని ఆన్ లైన్ గేమ్స్ పట్ల ఎంతగా అడిక్ట్ అయిపోతున్నారంటే ఇది వ్యసనంగా మారిపోయి..బంగారం లాంటి తమ భవిష్యత్తును, తమ కెరీర్లను నాశనం చేసుకుంటున్నారు.

Online Gaming: ఆన్‌లైన్ గేమ్‌ వ్యసనంతో 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. మమ్మీ సారీ అంటూ..
13 Year Old Boy Suicide
Follow us on

పిల్లలు మొబైల్స్ లోని ఆన్ లైన్ గేమ్స్ పట్ల ఎంతగా అడిక్ట్ అయిపోతున్నారంటే ఇది వ్యసనంగా మారిపోయి.. బంగారం లాంటి తమ భవిష్యత్తును, తమ కెరీర్లను నాశనం చేసుకుంటున్నారు. ఆ మోజులో పడి తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. పేరెంట్స్ మందలిస్తే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఈ రాష్ట్రంలోని చాత్తర్ పూర్ జిల్లాలో 13 ఏళ్ళ కుర్రాడు ఆన్ లైన్ గేమ్ లో 40 వేల రూపాయలు నష్టపోయి డిప్రెషన్ లో పడిపోయాడు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరో తరగతి చదువుతున్న ఈ బాలుడు పాథాలజీ ల్యాబ్ యజమాని కొడుకని తెలిసింది. ఎంతసేపూ ఫోన్ పట్టుకుని ఈ గేమ్ ఆడుతున్నావని, చదువుకోవాలని ఇతని తల్లి మందలించినట్టు తెలుస్తోంది. తల్లి మందలింపుతో బాటు తాను 40 వేలు నష్టపోవడంతో ఆ మానసిక వేదన భరించలేక ఈ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తన తల్లికి చెందిన యూపీఐ అకౌంటు నుంచి ఈ కుర్రాడు ఈ డబ్బు విత్ డ్రా చేసి ‘ఫ్రీ ఫైర్ గేమ్’ అనే ఆన్ లైన్ ఆట ఆడి నష్టపోయాడు.

తనను క్షమించాలని, ఈ గేమ్ లో ఈ డబ్బు లాస్ అయ్యాయని యితడు తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.ఇతని తల్లి ఆరోగ్య శాఖలో పని చేసేదని, తల్లీ తండ్రీ ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి దిగాడని పోలీసులు తెలిపారు. గత జనవరిలో కూడా ఇదే రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో 12 ఏళ్ళ బాలుడు ఈ ఆన్ లైన్ గేమ్ కి బానిస కావడంతో తండ్రి మందలించి ఫోన్ లాక్కున్నాడని, దాంతో తన ప్రాణం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: BCCI: భారత్‌కి రానివ్వమంటూ బీసీసీఐ బెదిరిస్తోంది.. మాజీ దిగ్గజ క్రికెటర్ ఆరోపణలు

Crime News: బంగారం షాపులలో దొంగతనం చేస్తున్న మహిళా దొంగల ముఠా.. సినీ ఫక్కీలో పట్టుకున్న పోలీసులు