Rajasthan Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, బస్సు ఢీకొని పదిమంది దుర్మరణం చెందినట్లు సమచారం. ట్రక్కు – ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ ప్రాంతంలోని బార్మర్-జోధ్‌పూర్ హైవేపై పచ్‌పద్ర సమీపంలో చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ బస్సును ఢీ కొట్టడంతోనే ఈ ఘటన జరిగింది. ప్రమాదం అనంతరం ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుందని పోలీసులు తెలిపారు. బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు.
10గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం అశోక్ గెహ్లాట్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మందిని సజీవంగా రక్షించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Five people dead, several injured in collision between a passenger bus and a truck near Pachpadra in Rajasthan’s Barmer district, say police
CM Ashok Gehlot directs District Collector regarding relief and rescue operations, asks him to ensure medical treatment for the injured pic.twitter.com/wLyd9ra0xt
— ANI (@ANI) November 10, 2021
Also Read: