Crime News: కాసులకు కక్కుర్తిపడిన కసాయి తండ్రి.. అప్పుడే పుట్టిన బిడ్డను ఏం చేశాడంటే..?

|

Mar 30, 2022 | 6:18 AM

Bhadradri Kothagudem: తల్లి పొత్తిళ్లలో వెచ్చగా ఉండాల్సిన పసికందులను అమ్మేసే దుర్మార్గులు పెరిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాసులకు కక్కుర్తిపడి

Crime News: కాసులకు కక్కుర్తిపడిన కసాయి తండ్రి.. అప్పుడే పుట్టిన బిడ్డను ఏం చేశాడంటే..?
Follow us on

Bhadradri Kothagudem: తల్లి పొత్తిళ్లలో వెచ్చగా ఉండాల్సిన పసికందులను అమ్మేసే దుర్మార్గులు పెరిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాసులకు కక్కుర్తిపడి కన్న బిడ్డని అమ్ముకున్నాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. ఏపీలోని పశ్చిమగోదావరి (West Godavari district) జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లికి చెందిన ఘంటా అరుణ్‌కుమార్‌- చిలకమ్మ భార్యాభర్తలు. ఈ నెల 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (aswaraopeta) లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది చిలకమ్మ. ఆమె మత్తులో ఉండగానే భర్త అరుణ్‌ కుమార్, అత్త ఘంటా మేరీ కలిసి శిశువును చింతలపూడి మండలానికి చెందిన ఆర్‌ఎంపీలు బుచ్చిబాబు, శ్రీనివాస్, అశ్వారావుపేటకు చెందిన ప్రశాంతి సహకారంతో విశాఖపట్నం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కి 2 లక్షలకు అమ్మేశారు.

అయితే.. శిశువు గురించి అల్లిపల్లి అంగన్‌వాడీ టీచర్‌ విజయలక్ష్మి, శిశుసంక్షేమ శాఖ అధికారులు ఆరా తీయగా, విక్రయించినట్లు తేలింది. దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అరుణ్‌కుమార్, మేరితోపాటు బుచ్చిబాబు, శ్రీనివాస్, ప్రశాంతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. స్పెషల్ టీమ్ ద్వారా విచారణ చేపట్టి విశాఖలో శిశువు ఆచూకీ కనుగొన్నారు. శిశువును అశ్వారావుపేటకు తీసుకొచ్చి, ఐసిడిఎస్ సిబ్బందికి అప్పగించారు పొలీసులు.

అంతకు ముందే వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇంకా పోషించే స్తోమత లేకనే శిశువును విక్రయించారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఇష్యూలో ఇన్వాల్వ్‌ అయిన వారందరిపై చర్యలు తీసుకుంటామని అశ్వరావుపేట ఎస్సై చల్లా అరుణ స్పష్టం చేశారు.

Also Read:

Telangana: రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు..చిన్నారి మృతి.. పలువురికి గాయాలు..

China plane crash: చైనా విమాన ప్రమాదంలో సిబ్బందితో సహా 132 మంది మృతి! ఆ 2 బాక్సుల ఆధారంగానే నిజానిజాలు తేల్చలేం..