Corona: కరోనాని ఓడిస్తున్న Zycov-D.. మూడు డోసులకి కేవలం ఎంతంటే..?

|

Feb 02, 2022 | 4:07 PM

Corona: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జైడస్ క్యాడిలా (Zydus Cadila) తన యాంటీ కోవిడ్ -19 వ్యాక్సిన్ ZyCoV-D ని కేంద్ర ప్రభుత్వానికి

Corona: కరోనాని ఓడిస్తున్న  Zycov-D.. మూడు డోసులకి కేవలం ఎంతంటే..?
Zycov D
Follow us on

Corona: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జైడస్ క్యాడిలా (Zydus Cadila) తన యాంటీ కోవిడ్
-19 వ్యాక్సిన్ ZyCoV-D ని కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేయడం ప్రారంభించింది. ప్రభుత్వ
ఆదేశాల మేరకు కంపెనీ సరఫరా ప్రారంభించినట్లు జైడస్ క్యాడిలా బుధవారం ప్రకటించింది. ఇది
కోవిడ్-19కి ‘ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్’ అందిస్తుంది. ఇది కాకుండా తన యాంటీ కోవిడ్
వ్యాక్సిన్‌ను ప్రైవేట్ మార్కెట్‌లో విక్రయించాలని యోచిస్తోంది. Zycov-D మూడు డోసులు
వేసుకోవాలి. అహ్మదాబాద్‌ చంగోదర్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక
జైడస్ వ్యాక్సిన్ టెక్నాలజీ ఎక్స్‌లెన్స్ సెంటర్ నుంచి ప్రభుత్వానికి సరఫరా ప్రారంభించినట్లు కంపెనీ
తెలిపింది.

ఈ వ్యాక్సిన్ డోస్ ధర రూ.265 ఉంటుంది. వస్తువులు, సేవల పన్ను (జిఎస్‌టి) మినహా
కొనుగోలుదారుకు ఒక్కో డోస్‌కు రూ.93 చొప్పున అందిస్తామని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోని
మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన DNA-ఆధారిత సూది రహిత COVID-19 వ్యాక్సిన్
Zycov-D. ఆగస్టు 20న డ్రగ్ రెగ్యులేటర్ నుంచి అత్యవసర వినియోగ ఆమోదాన్ని పొందింది.
12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు తీసుకోవచ్చు.

టీకా ప్రభావం 66.60 శాతం

ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ దేశంలోని 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల
పిల్లలకు ఇస్తున్నారు. ఇప్పుడు జైకోవ్-డి పిల్లలకు రెండో టీకా అవుతుంది. ఇప్పుడు 12 నుంచి 18
సంవత్సరాల మధ్య యుక్తవయస్సులో ఉన్నవారు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్
ప్రభావం 66.60 శాతం ఉంటుందని జైడస్ కాడిలా పేర్కొంది. ఈ మూడు-డోస్‌లు నాలుగు
వారాల వ్యవధిలో ఇస్తారు. మొదటి డోస్ తక్కువగా ఉన్న బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్,
తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో ప్రయోగించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ
శాఖ తెలిపింది. ఈ వ్యాక్సిన్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

కంపెనీ ఏటా 10-12 కోట్ల డోసులను సిద్ధం చేస్తుంది

ఇది 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. ఇది సూది రహిత టీకా. ఇది జెట్ ఇంజెక్టర్
ద్వారా ఇస్తారు. ఏటా 10 నుంచి 12 కోట్ల డోసులను సిద్ధం చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది.
అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిలాకు చెందిన ఈ వ్యాక్సిన్‌ను గతేడాది ఆగస్టు 20న ప్రభుత్వం
ఆమోదించింది. అంతకుముందు జైడస్ 28 వేల మంది వాలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షించారు.

Zodiac Signs: ఈ 4 రాశుల వ్యక్తులు ఎవ్వరితో కలవరు.. మాట్లాడటానికి ఇష్టపడరు..?

UPI Free: దుకాణదారులకు గుడ్‌న్యూస్‌.. మరో ఏడాది పాటు UPI ఉచితం

అమ్మకాలలో సరికొత్త మైలురాయిని సాధించిన టాటా.. EV కార్లకి పెరుగుతున్న ప్రజాధారణ..