Covid-19 Pandemic: కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి సంతానం కోసం ప్రయత్నిస్తున్న స్త్రీ పురుషులకు సంతానం కలగడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించారు. ఆ సమస్యను పరిష్కరించే దిశగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా సోకి సంతానం కలగడంలో ఇబ్బందులు ఏర్పడితే.. జింక్ ఆ సమస్యను పరిష్కరిస్తుందని కొత్త అధ్యయనద్వారా తెలుస్తోంది.
గర్భధారణకు ప్రయత్నిస్తున్న స్త్రీపురుషులకు జింక్ మందులు కరోనావైరస్ మహమ్మారి సమయంలో పునరుత్పత్తికి సహాయపడతాయని ఓ అధ్యయనం ద్వారా తెలుస్తోందని ఓ పత్రికలో ప్రచురించబడింది. కోవిడ్ 19 ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. అంతేకాదు దీని ప్రభావం స్త్రీ, పురుషుల సంతానోత్పత్తిపై కూడా పడింది. దీంతో తాజాగా ఈ మహమ్మారి సంతానోత్పత్తి పై చూపించే చెడు ప్రభావాన్ని తగ్గించి సంతానోత్పత్తిని పెంచే మార్గాన్ని పరిశోధకులు కనుగొన్నారు. జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుందని తెలిపారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో గర్భం కోసం ప్రయత్నిస్తున్న జంటలు రోజుకు 50 మి.గ్రా వరకు జింక్ ను తీసుకోవాలని సూచించారు. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి కోవిడ్ -19 వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తుంది. జింక్ లో ఉన్న సైటోకిన్ స్ట్రోమ్ (cytokine storm) రోగనిరోధకపై ప్రబావం చూపించి.. కోవిడ్ -19 తో పోరాడుతుంది. అంతేకాదు.. కణజాల నష్టాన్ని, అవయవ వైఫల్యాన్ని నిరోధిస్తుంది. కోవిడ్ 19 ప్రభావం చూపించే మైటోకాండ్రియాను జింక్ రక్షింస్తుంది. అంతేకాదు.. స్పెర్మ్ యొక్క పునరుత్పత్తి శక్తిని జింక్ కాపాడుతుందని పరిశోధకులు చెప్పారు.
జింక్ లో ఉండే యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లు ఈ వైరస్ పై అత్యంత ప్రతిభావంతంగా పోరాడతాయని చెప్పారు. అదే సమయంలో గర్భంలో ఉన్న పిండం పెరుగుదలకు మంచి ప్రయోజనకారి అని తెలిపారు.. ఇక స్త్రీలో ఉన్న గర్భధారణ సమస్యలను తగ్గిస్తుందని గుర్తించారు. కరోనా సమయంలో ఎదురయ్యే ఆక్సీకరణ కణ నష్టాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
అయితే కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న వ్యక్తులకు ఒక్క జింక్ మాత్రమే సరిపోదని.. వ్యాధి తీవ్రతను బట్టి ఇతర మందులను కూడా వాడాల్సిందేనని చెప్పారు. కోవిడ్ -19 ప్రారంభ దశలలో ఉన్నవారికి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో జింక్ సహాయపడవచ్చునని పరిశోధకులు చెప్పారు .
Also Read: