ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటి 70 లక్షలకు పైగానే కేసులు చేరాయి. కరోనా సోకే విషయంలో యువకులు కూడా అతీతులు కాదని పునరుద్ఘాటించింది డబ్ల్యూహెచ్‌వో. ఈ విషయాన్ని ఇది వరకే స్పష్టం చేశామని.. అయినప్పటికీ మరోమారు హెచ్చరిస్తున్నట్లు కీలకమైన కామెంట్స్ చేశారు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసిస్. అలాగే యువకులను కూడా కరోనా వైరస్ బలహీన పరుస్తుందని, చంపేయగల శక్తి కూడా ఆ వైరస్‌కు ఉన్నట్లు టెడ్రోస్ తెలిపారు.
ఈ కోవిడ్ కేవలం వృద్ధులకు మాత్రమే వస్తుందంటే పొరపాటే. వృద్ధుల ప్రాణాలే కాకుండా.. యువత కూడా ఆ వైరస్‌కు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అనేక దేశాల డేటాను పరిశీలిస్తే.. 50 ఏళ్ల లోపు వారు కూడా హాస్పిటల్ పాలైన కేసులు చాలా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ వెల్లడించారు. జెనీవాలో వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టెడ్రోస్ ఈ విషయాలను తెలిపారు. మాకు కరోనా రాదని యూత్ అపోహలో ఉంటున్నారు. అంతేకాకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈ వ్యాధి ప్రమాదకర స్థాయిని ఎవరూ అంచనా వేయలేం. వచ్చే రోజుల్లో ఈ కోవిడ్ మహమ్మారి మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. అప్పుడు కరోనాను అదుపు చేయడం కష్టమవుతుందని డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు.
Read More:
‘సచిన్ కూతురు సారా’, ‘క్రికెటర్ శుభ్ మాన్ గిల్’ మధ్య ఏం జరుగుతోంది?
ప్రముఖ నటుడు శరత్ కుమార్‌కి షాక్.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..
తన తాతను తలుచుకుని ఎమోషనల్ అయిన బన్నీ.. ట్వీట్ చేస్తూ..