ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి పలువురు ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,53,73,616 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అలాగే ఇప్పటివరకూ 6,30,193 మంది కోవిడ్‌తో మరణించారు. ప్రస్తుతం 53,94,222 యాక్టీవ్ కేసులు ఉండగా, 99,79,394 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తాజాగా 60 వేలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 41,00,875కు చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,46,183 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.
అలాగే భారత్‌లో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 37,724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,92,915కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,11,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 7,53,050 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 648 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 28,732 మంది మరణించారు.
Read More:
11 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కి ‘అరుంధతి’?
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయం.. విపరీతంగా కేసులు నమోదు..