ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

| Edited By:

Jun 15, 2020 | 7:28 AM

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆదివారం 121691 కొత్త కేసులు రావడంతో..

ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు..
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆదివారం 121691 కొత్త కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 79,82,215కి చేరాయి. అలాగే నిన్న 3248 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 4,35,166కి చేరింది. ఇక ప్రస్తుతం 3443183 యాక్టీవ్ కేసులు ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 4103866గా ఉంది.

ఇక అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. ఆదివారం కొత్తగా 19223 కేసులొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21,61,447కి చేరాయి. అలాగే నిన్న 326 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 117853కి చేరింది. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

అలాగే భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్న కొత్తగా భారత్‌లో 11929 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 320922కి చేరింది. అలాగే 24 గంటల్లో 311 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9195కి చేరింది. ఇక మొత్తం ఇప్పటివరకూ రికవరీ కేసుల సంఖ్య 149348గా ఉంది. మన దేశంలో కరోనా సోకిన వారిలో 50.6 శాతం మంది రికవరీ అవుతుండటం మంచి విషయం.

Read More: 

కరోనా వ్యాప్తిపై సమీక్ష.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్…

వాళ్లెవరూ అసెంబ్లీకి రావడానికి వీల్లేదు.. ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇవే..