ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు వ‌ర్క్ ఫ్రం హోం !?

|

May 08, 2020 | 1:50 PM

ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు వ‌ర్క్‌ఫ్రం హోం క‌ల్పించ‌డానికి చాలా కంపెనీలు నిర్ణ‌యించుకున్నాయి.

ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు వ‌ర్క్ ఫ్రం హోం !?
Follow us on
దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం దేశంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది కేంద్రం. దీంతో అనేక కంపెనీలు త‌మ కార్య‌క‌లాపాల‌ను మూసివేయాల్సి వ‌చ్చింది. ఇక చాలా ఐటీ కంపెనీలు త‌మ ఉద్యోగుల‌తో వ‌ర్క్‌హోం చేయిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా అమ‌ల్లో ఉన్న లాక్‌డౌన్ మ‌రి కొద్దీ రోజుల్లో ముగియ‌నుంది. కానీ, దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో వ‌ర్క్‌ఫ్రం హోం నిర్ణ‌యాన్ని చాలా కంపెనీలు పొడిగించాల‌ని యోచిస్తున్నాయి. ఈ ఏడాది చివ‌రి దాకా కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించుకున్నాయి.
ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు వ‌ర్క్‌ఫ్రం హోం క‌ల్పించ‌డానికి ఫేస్‌బుక్ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌టికే వ‌ర్క్ ఫ్రం హోం ఇచ్చిన ఫేస్‌బుక్ సంస్థ‌..దానిని త‌మ ఉద్యోగుల కోసం ఏడాది చివ‌రి వ‌ర‌కు పొడిగించ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ట‌. కాగా, ఫేస్‌బుక్‌లో 48, 268 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. అయితే, వారంద‌రికీ వ‌ర్క్ ఫ్రంహోం ఇస్తారా…? లేదంటే ఇంత శాతం ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంద‌ని చెబుతారా అన్న‌ది ఉద్యోగుల్లో సందేహం నెల‌కొంది.