Corona Virus: యూరోపియన్ దేశాల్లో రోజు రోజుకీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజువారీ కొత్త కేసుల నమోదు, మృతుల సంఖ్య భారీగా ఉండడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. చైనా లో పుట్టిన ఈ మహమ్మారి కరోనా రెండేళ్ల కావస్తున్నా ఇంకా అదుపులోకి రాలేదు. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పడుతున్నా యూరోప్ దేశాల్లో మాత్రం రోజుకో సరికొత్త రూపం సంతరించుకుంటూ.. విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో యూరోప్ లో గత వారంలో 11 శాతం కేసులు పెరిగినట్లు ప్రకటించింది. అంతేకాదు.. వచ్చే వసంత కాలం నాటికి కరోనా వైరస్ మహమ్మారి ఐరోపాలో 7,00,000 వరకూ కోవిడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని WHO యూరప్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ లుగే హెచ్చరించారు. అక్టోబర్ మధ్య కాలం నుంచి ఈ పెరుగుదల కొనసాగుతోందని చెప్పారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని.. యూరోప్ లోని దేశాలన్నిటిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెంచాలని సూచించారు. అంతేకాదు ప్రజలు ప్రభుత్వం తప్పనిసరిగా కరోనా నియంత్రణ కోసం నిబంధనలు పాటించాలని .. మాస్కులు అందరూ పెట్టుకోవాలని.. భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ఇప్పటికే యూరోపియన్ దేశాల్లో అనేక ప్రాంతంలో 1బిలియన్ కు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.
యూరప్, మధ్య ఆసియా లో COVID-19 కల్లోలం చాలా తీవ్రంగా ఉంది. అంతేకాదు శీతాకాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ప్రభుత్వాలు, ఆరోగ్య అధికారులు, వ్యక్తులు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ క్లూగే అన్నారు. గత వారంలో ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బెల్జియం దేశాలు కొవిడ్ నియంత్రణకు పాక్షిక లాక్‌డౌన్ సహా పలు కఠిన చర్యలు తీసుకున్నారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. జర్మనీలో మరణాలు లక్ష మార్కును దాటినట్టు పేర్కొంది. రష్యా లో కూడా కరోనా కల్లోలం కొనసాగుతుందని.. కనుక యూరోప్ ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటిస్తూ.. వ్యాక్సిన్ తీసుకోవాలని.. లాక్ డౌన్ పరిస్థితి వచ్చేలా నడుచుకోవద్దంటూ చెప్పారు.
Also Read: కాకినాడ డీసీసీబీ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..