‘రేడియేషన్ సూట్’తో ఎన్టీఆర్‌కు లింక్ ఏంటి? ఆ దర్శకుడి ట్వీట్‌కు అర్థమేంటి? ఒకవేళ రేడియేషన్ సూట్‌లో ఎన్టీఆర్ కనిపించనున్నారా? అని తారక్ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడం ఖాయమని ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీస్ పరోక్షంగా స్పష్టతనిచ్చేశాయి. కాగా ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలిపింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అయితే ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్‌కి, ఇప్పుడు మైత్రీ మూవీస్ చేసిన ట్వీట్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. అందులో చిత్ర కథకు సంబంధించిన ఏదో క్లూ ఇస్తున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం దీనిపైనే సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
‘ఎన్టీఆర్ బర్త్‌డేకి విష్ చేస్తూ.. ఎన్టీఆర్ న్యూక్లియర్ ప్లాంట్.. ఆయన చుట్టూ ఉన్న రేడియేషన్‌ను ఎదుర్కోవడానికి ఈ సారి నేను రేడియేషన్ సూట్‌లో వస్తాను’.. అని ట్వీట్ చేశారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ‘ప్రశాంత్ నీల్‌కు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేస్తూ.. త్వరలోనే రేడియేషన్ సూట్‌లో కలుద్దాం’. అని పేర్కొంది.
Wishing @prashanth_neel garu, sensational Director and a gem of a Human very Happy Birthday ?
Waiting to meet you soon in a Radiation Suit ? pic.twitter.com/KWSPD7D0SD
— Mythri Movie Makers (@MythriOfficial) June 4, 2020
ఈ రెండు ట్వీట్స్ గమనిస్తే.. ‘రేడియేషన్ సూట్’ అనే పదం ఉంది. దీంతో టైటిల్ లేదంటే కథకు సంబంధించిన ఏదో క్లూ టీం ఇస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ట్వీట్ల వెనుక ఏదైనా మర్మం ఉందా? లేక సరదాగా వాడిన పదాలేనా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
So….finally I know how it feels like to sit next to a nuclear plant….next time bringing my radiation suit to be around all that crazy energy @tarak9999
Happy birthday brother!!!
Have a safe and great day
See you soon…#HappyBirthdayNtr#stayhomestaysafe— Prashanth Neel (@prashanth_neel) May 20, 2020
Read More:
తెలంగాణ హోం క్వారంటైన్ న్యూ గైడ్‌లైన్స్.. ఇంట్లో ఇలా ఉండాలి..