తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. జూన్ 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైందని తెలిపింది. అలాగే ఉత్తర అండమాన్ సముద్రపు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయిని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, డమన్ అండ్ డయ్యూ మొత్తం ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాలు, చత్తీస్ గఢ్, ఝార్ఖండ్, బీహార్‌లో మిగిలిన ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రాగల 48 గంటలలో నైరుతి రుతుపవనాలు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Read More:
కాణిపాకంలో కరోనా కలకలం.. హోమ్ గార్డ్‌కి పాజిటివ్..
బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..