కరోనా రోగుల్లో కొందరికి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఐసీయూ అంటే ఒంటరితనం. నోటికి ముక్కుకి గొట్టాలు.. చుట్టూ వైర్లు.. మానిటర్ల రొద.. ఈ మతిపోగొట్టే పరిస్థితి నుంచి పేషెంట్స్ కు కొంత ఉపశమనం కలిగించేందుకు ఓ నర్సు గిటారు పట్టింది. గొంతెత్తి పాట అందుకుంది. ఇంతకూ ఆమె పాడిన
పాట ఏమిటో తెలుసా.. యూ ఆర్ నాట్ అలోన్.. ఈ విశాల విశ్వంలో నువ్వు ఒంటరివి కాదు అని భుజం తట్టే పాట అది.కెనడాలోని అట్టావా హాస్పిటల్ లో పనిచేసే ఆమీ లిన్ హౌసన్ అనే నర్సు కరోనా రోగులను ఉత్సాహ పరిచేందుకు పాటపాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నది. ఇలా పాడడం తనకెంతో తృప్తినిచ్చిందని ఆమీ తెలిపింది. కరోనాతో తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ మంచానికి పరిమితమైన రోగులకు తన పాట ద్వారా ధైర్యం చెప్పడం కన్నా గొప్ప పని ఏముంటుందని ఆమె పేర్కొన్నది.
This is Amy-Lynn. An endoscopy nurse at The Ottawa Hospital, who has recently been redeployed to the ICU.
Here she is with a beautiful song for our patients… “You are not alone”.Thank you for lifting our spirits, Amy-Lynn! ?#StrongerTogether pic.twitter.com/Xn11mNr44D
— The Ottawa Hospital (@OttawaHospital) April 24, 2021
Also Read: అసలైన హీరో ఇతడేగా.. మనసు చలించి అంబులెన్స్ డ్రైవర్గా మారిన నటుడు..