బ్రేకింగ్: మరో బాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్

| Edited By:

May 24, 2020 | 10:05 AM

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకున్నా, లక్షణాలు కనిపించకపోయినా వరుసగా బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే సింగర్ కనికా కపూర్, నిర్మాత కరీం మెరానీ..

బ్రేకింగ్: మరో బాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్
Follow us on

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకున్నా, లక్షణాలు కనిపించకపోయినా వరుసగా బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే సింగర్ కనికా కపూర్, నిర్మాత కరీం మెరానీ, ఆ తర్వాత నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో సహాయకులుగా ఉన్న వారు కరోనా వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే.

తాజాగా మరో బాలీవుడ్ నటుడు కిరణ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో.. మే 14 నుంచి ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా 74 ఏళ్ల కిరణ్ పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటించారు. ఈ సందర్బంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. వైరస్ లక్షణాలు లేకపోయినా నాకు కరోనా పాజిటివ్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జ్వరం, దగ్గు కూడా లేదు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. అందుకే హోం క్వారంటైన్ అయ్యాను. కోవిడ్ నిర్థారణ అయి 10 రోజులు అయినప్పటికీ నాలో ఎలాంటి లక్షణాలు కనిపించ లేదు. మే 26న నాకు రెండో సారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నానని ఆయన వెల్లడించారు.

Read More: మా అమ్మాయికి ప్రభాస్ లాంటోడు కావాలి… అనుష్క తల్లి