యూపీలో థాయిలాండ్ మహిళ కోవిడ్ తో మృతి, అంత్య క్రియలను లైవ్ స్టీమ్ లో చూపిన పోలీసులు , రెండు పార్టీల మధ్య రేగిన రగడ

| Edited By: Phani CH

May 09, 2021 | 11:23 PM

థాయిలాండ్ కు చెందిన ఓ మహిళ యూపీ రాజధాని లక్నోలో కోవిద్ తో మరణించింది. 41 ఏళ్ళ ఈ మహిళ టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చిందని,

యూపీలో థాయిలాండ్ మహిళ కోవిడ్ తో మృతి, అంత్య క్రియలను లైవ్ స్టీమ్ లో చూపిన పోలీసులు , రెండు పార్టీల మధ్య రేగిన రగడ
Uttar Pradesh
Follow us on

థాయిలాండ్ కు చెందిన ఓ మహిళ యూపీ రాజధాని లక్నోలో కోవిద్ తో మరణించింది. 41 ఏళ్ళ ఈ మహిళ టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చిందని, కోవిద్ పాజిటివ్ లక్షణాలు కనబడడంతో ఈమెను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్చారని తెలిసింది. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఈ నెల 3 న మరణించింది. ఈమె అంత్యక్రియలను పోలీసులు లైవ్ స్ట్రీమ్ గా చూపడం విశేషం. అయితే ఆమె థాయిలాండ్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిందన్న విషయం మిస్టరీగా మారింది. బీజేపీ ఎంపీ సంజయ్ సేథ్ కుమారుడు ఈమెను థాయిలాండ్ నుంచి ఇండియాకు తీసుకువచ్చాడని సమాజ్ వాదీ పార్టీ నేతలు అంటుండగా తన కుమారుడికి ఈ ఉదంతంతో సంబంధం లేదని సేథ్ అంటున్నారు. అనవసరంగా తన కొడుకును ఈ వివాదంలోకి లాగవద్దని ఆయన కోరారు. కానీ సమాజ్ వాదీ పార్టీ నేతలు మాత్రం తమవద్ద ఆధారాలు ఉన్నాయని కరాఖండిగా చెబుతున్నారు. కాగా ఇప్పుడు ఇది ఈ రెండు పార్టీల మధ్య రగడగా మారింది. థాయిలాండ్ మహిళతో ఈ బీజేపీ ఎంపీ కుమారుడికి సంబంధం ఏమిటని సమాజ్ వాదీ పార్టీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అటు ఈ వ్యవహారంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఆమె వంట చేస్తే మరణమే.. మనుషుల్లేని దీవిలో 30 ఏళ్లు బంధించి శిక్ష!

Happy Mother’s Day 2021: ఫ్యామిలితో కలిసిన అందమైన వీడియోను షేర్ చేస్తూ మథర్స్ డే శుభాకాంక్షలను తెలిపిన రోజా..