యోగీ సర్కార్‌పై ప్రశంసలు.. ఇమ్రాన్‌పై సెటైర్లు.. పాక్ జర్నలిస్ట్ ట్వీట్ వైరల్..

|

Jun 09, 2020 | 10:04 AM

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను తన సొంత మీడియానే తక్కువ చేసి చూపించింది. కరోనా వైరస్‌పై పోరులో పాక్ ప్రభుత్వం డొల్లతనం కనిపించిందంటూ తాజాగా పాక్ జర్నలిస్ట్ చేసిన ఓ ట్వీట్..

యోగీ సర్కార్‌పై ప్రశంసలు.. ఇమ్రాన్‌పై సెటైర్లు.. పాక్ జర్నలిస్ట్ ట్వీట్ వైరల్..
Follow us on

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను తన సొంత మీడియానే తక్కువ చేసి చూపించింది. కరోనా వైరస్‌పై పోరులో పాక్ ప్రభుత్వం డొల్లతనం కనిపించిందంటూ తాజాగా పాక్ జర్నలిస్ట్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాకిస్తాన్‌, భారత్‌లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కరోనా కేసులు, మరణాలను పోలుస్తూ పాకిస్తాన్‌కు చెందిన ‘డాన్’ పత్రిక ఎడిటర్ ఫద్ హుస్సేన్ ఓ ట్వీట్ చేశారు. కరోనా కట్టడిలో యూపీ ప్రభుత్వం విజయం సాధించిందంటూ ప్రశంసలు కురిపించాడు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్‌ లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని.. అయితే పాకిస్తాన్‌లో మాత్రం ఇమ్రాన్ ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

దీన్ని ఉద్దేశిస్తూ హుస్సేన్ పాక్, యూపీలో మరణాలను పోలుస్తూ ఓ గ్రాఫ్ ట్వీట్ చేశారు. దాని ప్రకారం ‘పాక్ జనాభా 20.8 కోట్లు. యూపీ జనాభా 22.5 కోట్లు. యూపీలో 10,619 మందికి కరోనా రాగా, 275 మంది చనిపోయారు. పాక్ లో 98, 943 మందికి కరోనా రాగా 2002 మంది మరణించారు. యూపీ కంటే పాకిస్తాన్‌లో మరణాలు రేటు ఏడురెట్లు అధికంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: 

రేపటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ…

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!