వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్

కరోనా ఎఫెక్ట్‌తో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పనిలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు..

వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్

Edited By:

Updated on: Mar 21, 2020 | 9:52 PM

కరోనా ఎఫెక్ట్‌తో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పనిలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఆదివారం (22వ తేదీ) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకూ ‘జనతా కర్ఫ్యూ’ ఉండటంతో ఐటీ ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉండటంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

అలాగే కోవిడ్-19 నివారణకు ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం అందరూ ‘జనతా కర్ఫ్యూ’కు సిద్ధంగా ఉన్నారన్నారు. దీంతో ఆరోజు ఇంటి నుంచి విధులు నిర్వహిస్తోన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 24 గంటలు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించాలని సూచించారు. ఈ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. అలాగే టెలికాం సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే ఇందులో ఎలాంటి సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించినట్లు ఆయన తెలిపారు.


Read More this also:

‘కరోనా వైరస్’ పోవాలంటే సెక్స్ అవసరం.. శ్రీరెడ్డి స్టన్నింగ్ కామెంట్స్

కరోనా ఎఫెక్ట్‌‌తో.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..

కరోనా ఎఫెక్ట్: పోయిన గతం మళ్లీ గుర్తొచ్చింది

బిఎస్‌ఎన్‌ఎల్ క్రేజీ ఆఫర్.. రోజుకి 5జీవీ ఫ్రీ..ఫ్రీ..

జబర్దస్త్‌ షోలో క్లాషెస్.. స్టేజ్ దిగి వెళ్లిపోయిన టీం లీడర్..

కరోనాలో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమే