హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కరోనా కలకలం

| Edited By:

Mar 14, 2020 | 11:36 AM

హైదరాబాద్‌లో మరోసారి కరోనా కలకలం రేగింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రెండు అనుమానిత కేసులను గుర్తించారు అధికారులు. థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా వారిని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది గుర్తించారు. ఇటలీ, దుబాయ్‌ నుంచి వచ్చిన..

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కరోనా కలకలం
Follow us on

హైదరాబాద్‌లో మరోసారి కరోనా కలకలం రేగింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రెండు అనుమానిత కేసులను గుర్తించారు అధికారులు. థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా వారిని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది గుర్తించారు. ఇటలీ, దుబాయ్‌ నుంచి వచ్చిన 28, 40 ఏళ్ల మహిళలకు కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

కాగా.. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో అటు తెలంగాణ రాజ్ భవన్‌ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో ఓ వ్యక్తికి కరోనా వచ్చి.. తగ్గినా కూడా.. ఇంకా చాలామందికి వైరస్ లక్షణాలు కనిపించడంతో.. కేంద్ర ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాటిని తూచా తప్పకుండా ఫాలో చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగా.. తెలంగాణ రాజ్‌భవన్ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం గవర్నర్‌కి సంబంధిచించిన కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Read More this also: శభాష్ రోజమ్మా.. నీ టైమింగ్‌కి!

‘కరోనా’ రావడం మంచిదేనా? ఆ వైరస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!

రోజా ‘రచ్చబండ’కు దొరబాబు దంపతులు

షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడాలనుకుంటున్నారా? ఈ ట్రిక్ యూజ్ చేయండి