కరోనా మహమ్మారి విజృంభణ కాస్త తగ్గుతుంది అనుకున్న సమయంలో కేరళలో నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. కేరళలో కేసుల పరిస్థితి థర్డ్ వేవ్ సంకేతమని గతంలోనే కేంద్ర నిపుణుల బృందం పేర్కొంది. ఇప్పుడు తాజాగా కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, డైలీ విపరీతంగా నమోదవుతున్న కేసులు కరోనా థర్డ్ వేవ్ ఆందోళనను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఓనం పండుగ తర్వాత అక్కడ వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేరళ కరోనా కల్లోలంతో పండుగలపై అన్ని రాష్ట్రాలను కేంద్రం కూడా అలెర్ట్ చేసింది. శుక్రవారం దేశంలో 46,759 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇందులో 32,801 కేసులు కేరళలోనే నమోదయ్యాయంటే.. అక్కడి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుస్తోంది. దీంతో అక్కడ వెంటనే లాక్‌డౌన్ విధించాలని.. యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కేరళలో కరోనా వ్యాప్తిపై టీవీ9 గ్రూప్ సీఈఓ బరున్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సత్వరమే కఠిన లాక్‌డౌన్ విధించాలని సీఎం పినరయ్ విజయన్‌కు ట్విట్టర్ వేదికగా సూచించారు. డైలీ కేసుల సంఖ్య 10వేల లోపుకు వచ్చేవరకు ఆంక్షలు సడలించకుండా.. స్ట్రిక్ట్ లాక్‌డౌన్ విధించాలని కోరారు. సరిహద్దులు మూసివేసి.. వ్యాప్తి కారణాలను అన్వేశించి కట్టడి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సెకండ్ వేవ్ ప్రారంభ సమయంలో కూడా తాను సూచించిన ‘షార్ట్ సర్కుట్’ లాక్‌డౌన్ ట్వీట్ గురించి ఆయన తిరిగి ప్రస్తావించారు.
టీవీ9 సీఈఓ బరున్ దాస్ వేసిన ట్వీట్ దిగువన చూడండి
H’ble CM @vijayanpinarayi
I tried to draw ur attention before 2nd wave. I am again humbly submitting to consider imposition of hard lock down in kerala till daily new cases fall below 10k. Borders should be sealed as well & source to be identified. @MoHFW_INDIA @AmitShah https://t.co/TdLFfPOqAS— Barun Das (@justbarundas) August 28, 2021
గతంలో బరున్ దాస్ వేసిన ట్వీట్ సారాంశం ఇది….
సెకండ్ వేవ్ ప్రారంభ సమయంలో కూడా బరున్ దాస్ కీలక సూచనలు చేశారు. మహారాష్ట్ర, కేరళ బోర్డర్లను క్లోజ్ చెయ్యాలని కోరారు. ‘షార్ట్ సర్క్యూట్’ లాక్‌డౌన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్‌మెంట్ జోన్స్‌లో అమలు చెయ్యాలని కోరారు. ఆ రెండు రాష్ట్రాలలో వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు.
Humble suggestion to avoid second wave
1.Seal the borders of maharashtra & kerala- especially flt and train
2.Deploy “Short circuit” lockdown-fully or in containment zones in these states
3.Rapid vaccination in these 2 states @MoHFW_INDIA @AmitShah @OfficeofUT @vijayanpinarayi https://t.co/ZOaxTDO4hq— Barun Das (@justbarundas) February 23, 2021
‘షార్ట్ సర్క్యూట్’ లాక్‌డౌన్ అంటే ఏమిటి…?
ఏ ప్రాంతంలో అయితే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందో ఆ ప్రాంతంలో అత్యంత కఠినమైన లాక్‌డౌన్ విధించడాన్ని షార్ట్ సర్క్యూట్ లాక్‌డౌన్ అంటారు. ఒక నిర్దేశిత ప్రాంతంలో ఈ లాక్‌డౌన్ కొంతకాలమే ఉన్నప్పటికీ.. కఠిన ఆంక్షల కారణంగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధానాన్ని తొలుత ఆస్ట్రేలియా ఫాలో అయ్యారు. అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి.