శ్రీవారి దర్శనాలపై టీటీడీ ఈఓ క్లారిటీ.. దర్శనాలు అప్పుడే..

శ్రీవారి దర్శనాలపై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ క్లారిటీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ నెల 8వ తేది నుండి భక్తులకు దర్శనాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రేపు మరోసారి సమావేశం నిర్వహించి దర్శన విధి విధానాలను..

శ్రీవారి దర్శనాలపై టీటీడీ ఈఓ క్లారిటీ.. దర్శనాలు అప్పుడే..

Edited By:

Updated on: Jun 04, 2020 | 3:31 PM

శ్రీవారి దర్శనాలపై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ క్లారిటీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈ నెల 8వ తేది నుండి భక్తులకు దర్శనాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రేపు మరోసారి సమావేశం నిర్వహించి దర్శన విధి విధానాలను ప్రకటిస్తాం. భక్తుల సంఖ్య, గదుల కేటాయింపు, రవాణా, ప్రసాదాల విక్రయం, టైంస్లాట్ టికెట్ల విధానం, థర్మల్ స్క్రీనింగ్, అన్న ప్రసాద భవనం ప్రారంభం వంటి అంశాలపై అంచనాకు వచ్చాం. దర్శన విధి విధానాలను నిర్ణయించి 8వ తేది నుండి దర్శనాలు ప్రారంభిస్తామన్నారు.

అలాగే హుండీని తాకకుండా కానుకలను అందులో సమర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే భక్తులకు సంబంధించి అన్ని రకాల తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూస్తామన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా టీటీడీ సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. కాగా లాక్‌డౌన్ 5.0లో భాగంగా కేంద్రప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలు ఆలయాలు తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read More: 

బాల్కానీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..

బ్రేకింగ్: ఏపీలోని గ్రామ వాలంటీర్‌కు కరోనా

ఫోన్లో 17 రకాల ఆర్టీఏ సేవలు.. ఇక నో ఆఫీస్..

బాలీవుడ్‌ మరో విషాదం.. ఆయన ఇక లేరు