అడ్వకేట్ల కోసం మూడు ప్రత్యేక ఆస్పత్రులు..టీ సర్కార్‌ నిర్ణయం !

తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 40వేల మార్క్‌ను చేరుకుంది. గురువారం ఒక్క రోజే 1676 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో వైరస్‌ తీవ్రత అధికమవుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్‌ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

అడ్వకేట్ల కోసం మూడు ప్రత్యేక ఆస్పత్రులు..టీ సర్కార్‌ నిర్ణయం !
Follow us

|

Updated on: Jul 17, 2020 | 4:16 PM

తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 40వేల మార్క్‌ను చేరుకుంది. గురువారం ఒక్క రోజే 1676 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో వైరస్‌ తీవ్రత అధికమవుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్‌ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వైరస్ బారినపడుతున్న వైద్యులు, ఉద్యోగులు, పోలీసుశాఖ, లాయర్లకు తగిన వైద్య సదుపాయాలను సమకూరుస్తోంది. ఇందులో భాగంగానే అడ్వకేట్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకించి మూడు ఆస్పత్రులను కేటాయించినట్లు సమాచారం.

కరోనా సోకిన అడ్వకేట్లకు వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు ఆస్పత్రులను కేటాయిస్తూ నిరయ్ణం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటిల్లో గచ్చిబౌలి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్), సూరారం మల్లా రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రులను లాయర్ల కోసం సర్కారు కేటాయించినట్లు సమాచారం. కరోనా బారిన పడి, పరిస్థితి విషమంగా ఉన్నబాధితులకు కామినేని, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లలో, నార్మల్ కేసులను టిమ్స్ లో అడ్మిట్ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇక జిల్లాల్లో లాయర్లు ఎవరైనా కరోనా బారిన పడి, పరిస్థితి విషమంగా ఉంటే.. వారిని హైదరాబాద్ తరలించేందుకు ప్రభుత్వ నోడల్ ఆఫీసర్ పర్యవేక్షించేలా సర్కార్‌ తగిన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.