వైట్‌హౌస్‌లో మరోసారి కరోనా కలకలం

|

Sep 17, 2020 | 1:08 PM

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది.. ఎంతగా కట్టడి చేయాలనుకున్నా సాధ్యం కావడం లేదు.. పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.. ఇంతగా వ్యాప్తి చెందుతుంటే వైట్‌హౌజ్‌కు పాకదా అన్న అనుమానం అక్కర్లేదు..

వైట్‌హౌస్‌లో మరోసారి కరోనా కలకలం
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది.. ఎంతగా కట్టడి చేయాలనుకున్నా సాధ్యం కావడం లేదు.. పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.. ఇంతగా వ్యాప్తి చెందుతుంటే వైట్‌హౌజ్‌కు పాకదా అన్న అనుమానం అక్కర్లేదు.. ఇంతకు ముందే కరోనా వైరస్‌ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టింది.. ఎలాగోలా అప్పుడు దాన్ని కంట్రోల్‌ చేయగలిగారు.. మళ్లీ ఇప్పుడు శ్వేతసౌధంలోకి కరోనా వైరస్‌ దూరింది.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొలువై ఉండే వైట్‌హైస్‌ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. ముగ్గురు ప్రపంచ న్యాకులతో కలిసి చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై ట్రంప్‌ సంతకం చేసిన మరుసటి రోజే కరోనా సంగతి బయటకు రావడం గమనార్హం.. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో తనకు సంబంధం లేదని, ఆయనతో సన్నిహితంగా ఉండలేదని ట్రంప్‌ గట్టిగా చెబుతున్నారు.. వైట్‌హౌస్‌ కూడా అదే చెబుతోంది.. కరోనా సోకిన వ్యక్తి చాలా దూరంగా ఉన్నారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కైలీ మెక్‌నానీ కన్ఫామ్‌ చేశారు.. కరోనా అంటుకున్న వ్యక్తి మీడియాకు దూరంగానే ఉన్నారని, సమావేశానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. పోయిన మార్చ్‌లోనే ట్రంప్‌ భద్రతా సలహాదారుడు రాబర్ట్‌ ఒబ్రెయిన్‌కు కరోనా సోకింది.. దాన్నుంచి ఆయన బయటపడిన తర్వాత వైట్‌హౌస్‌లోకి కరోనా ఎంటర్‌ కావడం ఇదే ప్రథమం..