Triple Mutation Variant: కరోనా మహమ్మారి భారత్‌లో తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. కేవలం 24 గంటల్లోనే ఏకంగా మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయంటేనే పరిస్థితులు ఎంతలా చేయిదాటిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఒక్క రోజులో వైరస్ బారిన పడి 2 వేలకు పైగా మంది మరణించడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌కు ట్రిపుల్ మ్యుటేషన్ సవాలు విసురుతోంది. మూడు రకాల కొవిడ్ స్ట్రెయిన్లు కలిసి కొత్త వేరియయంట్‌గా మారినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ కొత్త వెరియంట్‌ను భారత్‌లో మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్‌లలో పరిశోధకులు గుర్తించారు. ఇక ఈ ట్రిపుల్ మ్యుటెంట్ చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఈ వైరస్ తొందరగా అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై మెక్ గిల్ యూనివర్సిటీ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మధుకర్ మాట్లాడుతూ.. “మనం వ్యాక్సిన్ల పనితీరును మరింత అభివృద్ది చేసుకోవాలి. ఈ కొత్త వెరియంట్ భారత్‌కు ఛాలెంజ్‌గా మారిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ కొత్త తరహా వైరస్.. భారత్‌లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయి. అంతేకాకుండా ఈ ట్రిపుల్ మ్యుటేషన్ కారణంగా చిన్నారుల్లో కరోనా ఎక్కువగా సోకుతున్నట్లు తెలిపారు.
Also Read: కళ్ళకే కాదు.. చర్మంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తోన్న స్మార్ట్ ఫోన్స్.. సూచిస్తున్న నిపుణులు..