ప్రముఖ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్..

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ప్రముఖ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్..

Updated on: Jul 29, 2020 | 9:15 PM

SS Rajamouli Tests Corona Positive: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించారు. తనకు, తన కుటుంబానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. ఎటువంటి లక్షణాలూ లేవని అన్నారు. ప్రస్తుతం అందరం హోం క్వారంటైన్‌లో ఉన్నామని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

”నేను, నా కుటుంబసభ్యులు కొద్దిరోజుల క్రితం జ్వరంతో బాధపడ్డాం. అయితే ఆ తర్వాత అది తగ్గిపోయింది. కానీ మేము కరోనా టెస్ట్ చేయించుకున్నాం. స్వల్ప లక్షణాలతో కూడిన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాం. అందరం బాగున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శరీరంలో యాంటీబాడీస్ ఏర్పడాలని చూస్తున్నాం. ఆ తర్వాత ప్లాస్మా దానం చేస్తాం” అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.