
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గత రెండు మూడు రోజుల నుంచి తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం వెయ్యికి దగ్గరలో కోవిడ్ కేసులు చేరుతున్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. తాజాగా ఈరోజు తెలంగాణలో కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 కేసులు, వరంగల్ జిల్లా అర్బన్‌లో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యాయి. కాగా వీటితో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 990కి చేరాయి. ఇప్పటివరకూ కరోనాతో 25 మంది మృతి చెందారు. అలాగే ఇప్పటివరకూ 307 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 658 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Read More:
లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్ తెలిపితే.. డబ్బులే డబ్బులు!
అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!