క‌రోనాను జ‌యించిన మూడు నెల‌ల బాలుడు

కోవిడ్ బారిన ప‌డి ఇప్ప‌టికే చాలా చోట్ల చిన్నారులు మృత్యువాత‌ప‌డుతున్నారు. కానీ, అక్క‌డ మాత్రం ఓ బుడ‌త‌డు క‌రోనాను జ‌యించి చిరంజీవి అయ్యాడు.

క‌రోనాను జ‌యించిన మూడు నెల‌ల బాలుడు

Updated on: Apr 27, 2020 | 7:07 AM

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ ఎక్కువ‌గా వృద్దులు, చిన్న పిల్ల‌ల‌నే బ‌లి తీసుకుంటోంది.  అప్పుడే పుట్టిన ప‌సికందుల‌పై కూడా క‌రోనా ప్ర‌తాపం చూపుతోంది. కోవిడ్ బారిన ప‌డి ఇప్ప‌టికే చాలా చోట్ల చిన్నారులు మృత్యువాత‌ప‌డుతున్నారు. కానీ, అక్క‌డ మాత్రం ఓ బుడ‌త‌డు క‌రోనాను జ‌యించి చిరంజీవి అయ్యాడు. వివ‌రాల్లోకి వెళితే..

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ పంజా విసురుతోంది.  ఉత్త‌రాప్ర‌దేశ్ వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మ‌హ‌మ్మారి అంద‌రినీ  వెంటాడుతోంది. గోర‌ఖ్‌పూర్‌లో మూడు నెల‌ల బాలుడు క‌ర‌నా బారిన ప‌డ్డారు. 14 రోజుల చికిత్స అనంత‌రం వైర‌స్‌ నుంచి కోలుకున్నాడు. త‌ల్లి పాల‌తో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోని ఈ మ‌హ‌మ్మారిని జ‌యించాడు. ఏప్రిల్ 12న చిన్నారికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.  దీంతో బాలుడికి పాలిచ్చే స‌మ‌యంలో త‌ల్లికి కొన్ని జాగ్ర‌త్త‌లు చెప్పారు వైద్యులు. క‌రోనా సోకాక చిన్నారికి జ్వ కాకుండా ఎలాంటి స‌మ‌స్య‌లు రాలేదు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో క‌రోనా ప‌రీక్ష‌ల్లో ప‌సివాడికి క‌రోనా నెగిటివ్  రావ‌డంతో డిశ్చార్జి చేసిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు.
Follow Us