Third Wave of Corona in India: కేంద్ర ప్రభుత్వం మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే పండుగల సీజన్‌లో దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విరుచుకుపడే అవకాశముందని తెలిపింది. కరోనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపఫథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ‘వచ్చేది పండుగల సీజన్. ఈ సమయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. మరో 6 నుంచి 8 వారాలు కరోనా విషయంలో జాగత్తలు తీసుకోకుంటే.. కరోనా కేసులు పెరిగే అవకాశముందని గులేరియా తెలిపారు.
‘ఈ రెండు నెలల్లో దసరా, దీపావళి, ఛట్ పూజ లాంటి అనేక పండుగలు ఉన్నాయి. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ఈ పండుగలతోపాటే కరోనా థర్డ్ వేవ్ కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు’ అని గులేరియా వ్యాఖ్యానించారు. ఈ మేరకు గత నెలలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పౌల్ చేసిన హెచ్చరికలను కూడా రణ్‌దీప్ గులేరియా గుర్తుచేశారు. గత నెల జరిగిన డీడీఎంఏ సమావేశంలో మాట్లాడిన వీకే పౌల్.. పండుగలను ఎలాంటి ఆడంబరాలకు పోకుండా గతడాదిలాగా సాదాసీదాగా జరపుకోవాలని ఆయన సూచించారు.
కొవిడ్ నిబంధనలు పాటించకుంటే భారీ మూల్యం తప్పదని గులేరియా హెచ్చరించారు.కరోనా మహమ్మారి వ్యతిరేక పోరాటంలో ఇప్పటివరకు సాధించిన విజయాలన్నీ ఒక్కసారిగా రివర్స్ అవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు పండుగలను చాలా సింపుల్‌గా చేసుకోవాలని గులేరియా సూచించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందని ఇప్పటికే చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగలతోపాటే మహమ్మారి విస్తరిస్తుందని చెబుతున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు.
During the festive season, we have to remain alert and vigilant. If we remain careful for the next 6-8 weeks, then we will be able to see a decline in the overall number of COVID19 cases: AIIMS Director Dr. Randeep Guleria pic.twitter.com/nwQoWKEXTo
— ANI (@ANI) October 1, 2021
Read Also… BJP Praja Sangrama Yatra: సీఎం ఎవరైనా మొదటి సంతకం దానిపైనే.. బండి సంజయ్ కీలక ప్రకటన..!