కరోనాతో అల్లాడుతున్న స్పెయిన్‌.. 2 లక్షల కేసులు.. 25 వేల మరణాలు..!

స్పెయిన్ దేశం కరోనా మహమ్మారితో అల్లాడిపోతోంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను చూసి.. స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు అక్కడ రెండు లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా.. ఇరవై ఐదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తాజాగా కరోనా కేసుల వివరాలకు సంబంధించి బులిటెన్ విడుదల చేసింది. దేశంలో శనివారం కొత్తగా 1,366 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో స్పెయిన్‌ దేశ వ్యాప్తంగా నమోదైన […]

కరోనాతో అల్లాడుతున్న స్పెయిన్‌.. 2 లక్షల కేసులు.. 25 వేల మరణాలు..!

Edited By:

Updated on: May 02, 2020 | 11:12 PM

స్పెయిన్ దేశం కరోనా మహమ్మారితో అల్లాడిపోతోంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను చూసి.. స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు అక్కడ రెండు లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా.. ఇరవై ఐదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తాజాగా కరోనా కేసుల వివరాలకు సంబంధించి బులిటెన్ విడుదల చేసింది. దేశంలో శనివారం కొత్తగా 1,366 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో స్పెయిన్‌ దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,582కు చేరింది. ఇక శనివారం కరోనా బారినపడి మరో 276 ప్రాణాలు విడిచారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మొత్తం 25,100కు చేరింది. తాజాగా నమోదవుతున్న కేసులతో.. యూరప్‌ ఖండంలో అత్యధికంగా కరోన పాజిటివ్ కేసులు నమోదైన దేశంలో నిలుస్తోంది స్పెయిన్. తర్వాతి స్థానాల్లో ఇటలీ, బ్రిటన్లు ఉన్నాయి.

కాగా.. ప్రపంచ వ్యాప్తంగా 34లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా.. అందులో 2.40 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో పది లక్షల మందికిపైగా కరనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.