Telangana: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. వారు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

|

Jun 21, 2022 | 9:00 PM

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

Telangana: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. వారు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
Telangana Coronavirus
Follow us on

Hyderabad Covid Cases: ప్రజలారా బీ అలర్ట్.  తెలంగాణలో కరోనా తీవ్రత కొత్తగా పెరిగింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 26,704 మంది శాంపిల్స్ టెస్ట్ చేయగా… కొత్తగా 403 కొవిడ్‌ కేసులు వెలుగుచూశాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ లోనే 240 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా బారి నుంచి కొత్తగా 145 మంది కోలుకున్నారు. కేసుల సంఖ్యలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుందని బులిటెన్‌లో వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే  తప్ప బయటకు రావద్దని సూచించారు. జనసమ్మర్థ ప్రాంతాల్లో మాస్క్‌, భౌతికదూరం తప్పనిసరి అని హెచ్చరించారు. జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. సమూహాలలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

మరిన్ని కరోనా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి