మరోసారి తెలంగాణలో గుబులు పుట్టిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 535 మందికి పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలుచాస్తోంది.. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి.

మరోసారి తెలంగాణలో గుబులు పుట్టిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 535 మందికి పాజిటివ్‌

Updated on: Mar 28, 2021 | 10:21 AM

Telangana coronavirus: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలుచాస్తోంది.. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. శుక్రవారం రాత్రి 8గంటల నుంచి శనివారం రాత్రి 8గంటల వరకు 57,942 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 535 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి మరో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,688కి చేరింది. కరోనా బారి నుంచి శనివారం 278 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం 4,495 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారుల పేర్కొన్నారు. వీరిలో 1,979 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగ, మిగిలిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలావుంటే, ఒక జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 154 కేసులు నమోదయ్యాయి.

Telangana Corona Cases Today

Read Also… 

తెలంగాణలో మరో ఎన్నికల సందడి.. షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

అరవాలమ్మ తల్లి జాతరలో అశ్లీల నృత్యాలు.. ఆర్కెస్ట్రా ముసుగులో అసభ్యకర డాన్సులు.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..