AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరవాలమ్మ తల్లి జాతరలో అశ్లీల నృత్యాలు.. ఆర్కెస్ట్రా ముసుగులో అసభ్యకర డాన్సులు.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..

Aravalamma Jatara : పవిత్రమైన జాతరలో అశ్లీల నృత్యాలు నిర్వహించి ఆలయ ఆచారాలను భ్రష్ఠు పట్టిస్తున్నారు కొంతమంది. సీతానగరం మండలంలోని

అరవాలమ్మ తల్లి జాతరలో అశ్లీల నృత్యాలు.. ఆర్కెస్ట్రా ముసుగులో అసభ్యకర డాన్సులు.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..
Aravalamma Jatara
uppula Raju
|

Updated on: Mar 28, 2021 | 10:12 AM

Share

Aravalamma Jatara : పవిత్రమైన జాతరలో అశ్లీల నృత్యాలు నిర్వహించి ఆలయ ఆచారాలను భ్రష్ఠు పట్టిస్తున్నారు కొంతమంది. సీతానగరం మండలంలోని చీపురుపల్లి గ్రామపంచాయతీ అచ్చియ్యపాలెం గ్రామ సమీపంలో కొలువై ఉన్న అరవాలమ్మ తల్లి జాతరలో ఈ తంతు జరిగింది. ఆర్కెస్ట్రా పేరుతో స్టేజ్ డెకరేషన్ ఆర్భాటాలతో పట్టపగలే మహిళలు భోజనాలు చేస్తుండగా.. మండల చివర్లో అశ్లీల నృత్యాలు నిర్వహించారు. నూతన సర్పంచ్, సర్పంచ్ అనుచరుల సహకారంతోనే ఈ డ్యాన్స్‌లు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ఇప్పడు చర్చనీయాంశమైంది.

పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఈ అశ్లీల నృత్యాలు ఏంటని పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇటువంటి డ్యాన్స్‌లతో నేటి యువతకు మీరు ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిని చూసే కదా యువత తప్పుదోవ పడుతుందని ఆగ్రహిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక నేతలు స్పందించి మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అంటున్నారు. మరి నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.. ఇదిలా ఉంటే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కమిటీ మెంబర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారో ఆరా తీస్తున్నారు.

WhatsApp New Feature: యూజర్లు చేజారిపోకుండా వాట్సాప్‌ వ్యూహాలు.. అందుబాటులోకి మరో కొత్త ఫీచర్‌..

SarangaDariya : సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న సారంగదరియా సాంగ్.. కేవలం 27 రోజుల్లోనే..

Best Smartphones : పదివేల కన్నా తక్కువ ధరకే బెస్ట్ మొబైల్ ఫోన్స్.. ఏ ఏ కంపెనీ ఫోన్లు ఉన్నాయంటే..

ఏపీ వైసీపీలో తీవ్ర విషాదం.. బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూత