Telangana Covid 19 Cases: తెలంగాణలో కరోనా మహమ్మారి మెల్లమెల్లగా తగ్గముఖం పడుతోంది. వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో 58,335 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 257 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,57,376కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇక, 24 గంటల వ్యవధిలో కరోనా రాకాసి కోరలకు బలై ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 3,870కి చేరింది.
అయితే, గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 409 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,47,5944కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,912 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు, మహమ్మారిని తట్టుకునేందుకు నిర్దేశించిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది రాష్ట్ర సర్కార్. అవసరమైనవారికి మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆరోగ్య శాఖ.
ఇక, వివిధ జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి….