లండన్‌లో తెలంగాణ బోనాలు..తప్పని కరోనా ఎఫెక్ట్

|

Jul 22, 2020 | 7:45 PM

లండన్ నగరంలోని తెలంగాణ వాసులు బోనాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి తీవ్రత కారణంగా వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

లండన్‌లో తెలంగాణ బోనాలు..తప్పని కరోనా ఎఫెక్ట్
Follow us on

లండన్ నగరంలోని తెలంగాణ వాసులు బోనాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి తీవ్రత కారణంగా వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకునే దిశగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ప్రతి ఏటా బోనాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎల్లలు దాటి విదేశాల్లో ఉంటున్నా తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారు తెలంగాణ వాసులు.. లండన్ నగరంలో బోనాల పండును నిర్వహించింది తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్. టాక్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా బోనాలను ఘనంగా నిర్వహిస్తారు.. అయితే ఈ ఏడాది కరోనా ఆంక్షల కారణంగా నిరాడంబరంగా జరిపారు. టాక్ ముఖ్య నాయకులు మల్లా రెడ్డి – శుష్మణ దంపతుల ఇంట్లో అమ్మ వారి పూజ నిర్వహించి వేడుకలు చేపట్టారు. అమ్మవారి దయ ప్రజలందరిపైనా ఉండాలని, కరోనా మహమ్మారి త్వరగా, తగ్గిపోయి ప్రజా జీవితం తిరిగి యధాస్థితికి రావాలని అమ్మవారిని వేడుకున్నారు.

బోనాల సందర్భంగా తెలంగాణ అస్సోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ స్వరాష్ట్రంలోని ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిన సిధారెడ్డి,, తెలంగాణ సమాచారహక్కు చట్టం కమీషనర్ కట్టా శేఖర్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడమని టాక్ సభ్యులు అమ్మవారిని ప్రార్థించారు.