హైదరాబాద్‌లో మళ్లీ కోవిడ్ టెస్టులు.. ఈ ప్రాంతాల్లోనే..

| Edited By:

Jun 30, 2020 | 2:01 PM

హైదరాబాద్‌లో మళ్లీ కోవిడ్ పరీక్షలు నిర్వహించనుంది  తెలంగాణ ప్రభుత్వం. నేటి నుంచి పలు ప్రాంతాల్లో ఈ టెస్టులు మొదలు కానున్నాయి. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 50 వేల మందికి కరోనా పరీక్షలు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తిరిగి కరోనా పరీక్షలు..

హైదరాబాద్‌లో మళ్లీ కోవిడ్ టెస్టులు.. ఈ ప్రాంతాల్లోనే..
Follow us on

హైదరాబాద్‌లో మళ్లీ కోవిడ్ పరీక్షలు నిర్వహించనుంది  తెలంగాణ ప్రభుత్వం. నేటి నుంచి పలు ప్రాంతాల్లో ఈ టెస్టులు మొదలు కానున్నాయి. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 50 వేల మందికి కరోనా పరీక్షలు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తిరిగి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ ఎత్తున కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కాగా ఈ నెల 16 నుంచి 24 వరకూ నిర్దేశించిన అసెంబ్లీ నియోజక వర్గాల్లో 36 వేల శాంపిళ్లను తీసుకున్నారు. అందులో దాదాపు 27 వేలకు పైగా నమూనాలను పరిశీలించి ఫలితాలు ప్రకటించారు. అయితే మిగిలిన పరీక్షలు చేసేందుకు సామర్థ్యం లేకపోవడంతో తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు అధికారులు. ప్రస్తుతం ఈ పెండింగ్ పనులు కూడా పూర్తి కావడంతో తిరిగి పరీక్షలు చేయాలని అధికారులు రంగం సిద్ధం చేశారు.

ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ పరీక్షలు తిరిగి ప్రారంభం చేశారు. హైదరాబాద్ పరిధిలోని 30 నియోజకవర్గాల్లో ఈ శాంపిల్స్ సేకరణ ప్రక్రియ కొనసాగనుంది. కొండాపూర్, బాలాపూర్, వనస్థలిపురం, అంబర్ పేట్, గోల్కొండ, రామంతపూర్‌‌లోని హోమియో ఆస్పత్రి, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్, సరోజినీ ఆసుపత్రి తదితర నిర్దేశించిన ప్రాంతాల్లో కరోనా శాంపిళ్లను స్వీకరించనున్నారు వైద్యులు. కాగా కరోనా వైరస్ లక్షణాలున్నవారు మాత్రమే ఈ పరీక్షలు చేయించుకోవాలని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

Read More: ఏపీ మంత్రి పేర్ని నానికి అస్వస్థత..