
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని చర్యలు చేపడుతోంది. ఈ నేపధ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సీజనల్ వ్యాధుల కోసం మునిసిపాలిటీలలో ఒక ప్రత్యేక హెల్త్ క్యాలెండర్‌ను రూపొందిస్తున్నామని ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
లాక్‌డౌన్ తర్వాత కూడా పట్టణాల్లో కొన్ని ప్రత్యేక చర్యలు కొనసాగుతాయన్నారు. 15 వందల కోట్ల రూపాయల విలువైన కొత్త రోడ్లు వేస్తున్నామని, కొన్ని చోట్ల రోడ్డు మరమ్మత్తు పనులు సాగుతున్నాయని తెలిపారు. ఇవన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 1001 పాజిటివ్ కేసులు ఉండగా.. అందులో 316 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 25 మంది మృతి చెందారు.
Read Also:
కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..
హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!
డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..
‘పిల్లో ఛాలెంజ్’ కాదు భామలు.. ఫస్ట్ ఈమెను చూసి నేర్చుకోండి..